Andhra PradeshNews

టమోట కిలో రెండు రూపాయలు

మొన్నటి వరకు చుక్కులనంటిన టమోట ధరలు ఒక్కసారిదా ఢమాల్ అన్నాయ్. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమోట ధర ఒక్కసారిగా పడిపోయింది. నాలుగు రోజుల క్రితం కిలో పది, ఇరవైకి కొన్ని దళారులు ఇప్పుడు రూపాయి, రెండు రూపాయలు అని చెప్పడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. మదనపల్లె మార్కెట్ తర్వాత అంత పేరున్న పత్తికొండ మార్కెట్‌లో ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ధరలు పడిపోవడంపై టమోటను రోడ్డుపై పోసి రైతులు నిరసన తెలిపారు. గిట్టుబాటు ధరల రాకుంటే చావే శరణ్యమంటున్నారు రైతులు.