ఇవాళ ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్
దుబాయ్ లో జరుగుతున్న ఆసియా కప్ లో భాగంగా ఇవాళ టీమ్ ఇండియా, పాకిస్తాన్ జట్టుతో తలపడబోతోంది. ఆసియా ఖండం మాత్రమే కాదు… యావత్ ప్రపంచమంతా ఇవాళ దుబాయ్ కేంద్రంగా జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దాయాదుల మధ్య చాన్నాళ్లుగా క్రికెట్ సమరం జరగకపోవడంతో మ్యాచ్ పై ఎక్స్‌పెక్టేషన్స్ అంతకంతకూ పెరుగుతున్నాయ్. కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ కెప్టెన్ బాబర్ ఇద్దరూ మంచి ఫామ్ మీద ఉండటంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ అంతకంతకూ ఎక్కువవుతోంది . భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచేందుకు 63 శాతం అవకాశం ఉండగా.. పాకిస్తాన్ గెలిచేందుకు 33 శాతమే అవకాశం ఉన్నట్టుగా క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌పై ఎంతో ప్రచారం జరుగుతోంది. 2021 T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. గత ఏడాది జరిగిన ప్రపంచ ఈవెంట్‌లో భారత్ చిత్తుగా ఓడింది.
గాయం కారణంగా భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ఈ ఈవెంట్‌కు దూరమయ్యాడు . ఇదిలా ఉంటే, బ్యాటింగ్ లైనప్ ఆందళన కలిగిస్తోంది. రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరూ జట్టులో భిన్నమైన పాత్రలు పోషిస్తున్నప్పటికీ, వీరిలో ఎవరినైనా ఎంచుకోవాలో అర్థం కాని దుస్థితి నెలకొంది.

