Andhra PradeshNewsNews Alert

కోనసీమ వరద బాధిత గ్రామాలకు జగన్

Share with

ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో సీఎం జగన్ పర్యటించారు. చింతూరు మండలంలోని వరద బాధిత ప్రాంతాలలోని ప్రజలను సీఎం పరామర్శించారు. ఈ మండలంలోని కుయుగూరు,చట్టీలో ఉన్న వరద బాధితులతో ఆయన మాట్లాడారు.వరదల కారణంగా అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

ఈ మేరకు సీఎం జగన్ ఈ రోజు ఉదయం 8:40 నిమిషాలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల నుంచి హెలికాప్టర్‌లో చింతూరుకు చేరుకున్నారు.అక్కడి నుంచి సీఎం ఉదయం 9:10 నిమిషాలకు ఆదిమ గురుకుల కళాశాల ప్రాంగాణానికి చేరుకుని,ఉదయం 9:15 వరకు అక్కడే ఉండి వరద పరిస్థితి ,నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ఆయన ఉదయం 9:25 నిమిషాలకు కల్లేరు గ్రామ పంచాయితీ కుయుగూరు గ్రామానికి రోడ్డు మార్గాన చేరుకున్నారు. ఉదయం 9:30నిమిషాల నుంచి 10:00 గంటల వరకు కుయుగూరు వరద బాధితులతో ముఖాముఖిగా మాట్లాడి,వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఉదయం 11:10 నిమిషాలకు చట్టికి రోడ్డు మార్గాన చేరుకున్నారు.అక్కడ ఉదయం 11:40 నిమిషాల వరకు చట్టి వరద బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. అనంతరం ఉదయం 11:50 నిమిషాలకు తిరిగి ఆదిమ గురుకుల కళాశాలలో  హెలిప్యాడ్ వద్దకు చేరుకుని 12 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కన్నాయిగుట్టకు పయనం సాగించనున్నారు సీఎం జగన్.