కంకులు, మామిడికాయలతో సభకు..
బీజేపీ ఎమ్మెల్యేలు మొక్కజొన్న కంకులు, మామిడి కాయలతో అసెంబ్లీకి వచ్చారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మార్షల్స్ వారిని శాసనసభ ఆవరణలోనే అడ్డుకున్నారు. కంకులు, మామిడి కాయలు సభలోకి అనుమతిలేదని స్పష్టంచేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలకు, మార్షల్స్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వానలతో జరిగిన పంట నష్టంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. ఎకరాకు 30 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

