తెలంగాణాలో కేసీఆర్ మాటలకు కాలం చెల్లింది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తెలంగాణాలో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణాలో ఇక కేసీఆర్ మాటలకు కాలం చెల్లిందన్నారు. ఆయన మాటలు తెలంగాణాలో ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు లబ్దిదారుల ఎంపికపై సరైన మార్గదర్శకాలు లేవని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రంలో బీసీల అభివృద్దికి యాక్షన్ ప్లాన్ లేదన్నారు. తెలంగాణాలో పేపర్ లీక్ ఘటనతో ఉద్యోగాల భర్తీ నత్త నడకలా సాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ తాను రాష్ట్రంలో అమలు చేస్తానన్న గిరిజన బంధు ఊసే ఎత్తట్లేదన్నారు.

