NewsTelangana

మునుగోడు కాంగ్రెస్‌లో టికెట్ పంచాయితీ

Share with

కాంగ్రెస్ పార్టీకి కష్టాలు తగ్గేలా లేవు. దేశ వ్యాప్తంగా గందరగోళంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనూ పరిస్థితులు అలాగే కన్పిస్తున్నాయ్. తాజాగా కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఆ పార్టీలు లుకలలుకలు మొదలయ్యాయ్. మునుగోడు నుంచి ఎవరిని బరిలోకి దింపాలా అని కాంగ్రెస్ పెద్దలు తర్జనభర్జనపడుతున్నారు. స్థానిక నేత పాల్వాయి స్రవంతి తనకే మునుగోడు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే… పార్టీ పెద్దలు మరోలా ఆలోచిస్తున్నారు. చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ముక్కు, మొఖం తెలియని వారికి టికెట్ ఇస్తే ఊరుకోమంటూ ఆమె తేల్చి చెప్పారు. రేవంత్ పరువు నిలబెట్టుకోవాలంటే గెలిచే వారికి టికెట్ ఇవ్వాలని స్రవంతి కుండబద్ధలుకొడుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌పై ఇప్పటికే సీనియర్లు భగ్గమంటున్నారు. తాజాగా స్రవంతి సైతం టికెట్ ఇస్తే ఓకే… లేదంటే ఇక అంతే సంగతులన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

Read more: కేటీఆర్‌ సీఎం అయ్యేనా?