ఖమ్మంలో కారు ప్రమాదం ముగ్గురి మృతి
ఖమ్మం జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లాలోని వైరా మండలం పినపాక వద్ద ఒక కారు, లారీ ఢీకొట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు తుక్కుతుక్కుగా మారిపోయింది. కారులోని వారు ముగ్గురు  మృత్యువాత పడగా, మరో ఐదుగురు  తీవ్రగాయాలకు లోనయ్యారు. మృతులలో ఏడాది వయస్సున్న చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. బాధితులను ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కారును లారీ ఢీకొట్టిన తర్వాత కొంత దూరం ఈడ్చుకెళ్లిందని సమాచారం. దీనివల్ల ప్రమాద తీవ్రత పెరిగినట్లు భావిస్తున్నారు. వీరు సత్తుపల్లి పరిధిలోని కల్లూరు మండలం లాక్యా తండాకు చెందిన వారుగా గుర్తించారు.


 
							 
							