Home Page SliderNewsTelanganatelangana,Trending Today

ఈ న్యూఇయర్ నైట్ ‘జీరో యాక్సిడెంట్ నైట్’

ఈ కొత్త సంవత్సరం పండుగను ‘జీరో యాక్సిడెంట్ నైట్‌, జీరో ఇన్సిడెంట్ నైట్‌’గా చేస్తామని తెలంగాణ పోలీసులు గట్టిగా హామీ ఇచ్చారు. పార్టీల విషయంలో సభ్యత, భద్రత విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరిస్తున్నారు. పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావు లేకుండా పార్టీలు కొనసాగాలి. మాదకద్రవ్యాల విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ‘నో ఎంట్రీ’ హెచ్చరికలు ఏర్పాటు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. నేటి రాత్రి 10 గంటల నుండి బుధవారం తెల్లవారుజాము వరకూ ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. దాదాపు నగరంలోని ప్లైఓవర్లు అన్నింటినీ రాత్రంతా మూసేస్తామని అధికారులు పేర్కొన్నారు. పబ్స్, ఫామ్‌హౌస్‌లపై స్పెషల్ నిఘా ఏర్పాటు చేస్తున్నారు. డ్రంక్ డ్రైవింగే కాకుండా డ్రగ్స్ డ్రైవింగ్‌ను కూడా కనిపెట్టడానికి అత్యాధునిక పరికరాలను జర్మనీ నుండి తెప్పించారు.