‘సినీ తారలు రాజకీయాలలో రావడానికి ఇదే కారణం’..జయాబచ్చన్
సమాజ్ వాది పార్టీ ఎంపీ, అమితాబ్ సతీమణి జయా బచ్చన్ ఒక టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడారు. సినీతారలు రాజకీయాలలో ఎందుకు వస్తున్నారనే ప్రశ్నకు జవాబు చెప్పారు. ప్రజాదరణ పొందిన నటులు, ఆ ప్రజల కోసం ఏదో చెయ్యాలనే ఉద్దేశం కలిగి ఉంటారని అందుకు రాజకీయాలను మార్గంగా ఎన్నుకుంటారని పేర్కొన్నారు. నటులను ప్రజలు తమ సొంతవారిలా భావిస్తారని, వారిని చూడడానికి తరలివస్తారని, అదే రాజకీయ నాయకులు వస్తే చూడడానికి ఎవరూ రారన్నారు. బీజేపీ పార్టీ విజయాలపై మాట్లాడుతూ, బీజేపీలో ఒక్క మోదీ తప్ప మరే రాజకీయ నాయకుడు ప్రజాకర్షణ కలిగి లేరని, సినీనటులతో పోటీ పడలేరని జయా బచ్చన్ స్పష్టం చేశారు. బీజేపీ నాయకులందరూ కేవలం మోదీ పేరు బలం మీదనే ఎన్నికలలో గెలుస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

