Andhra PradeshHome Page Slider

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం

•ఆర్‌బీఐ నివేదిక ప్రకారం టీడీపీ హయాంలోనే ఎక్కువ అప్పులు
•ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న ఓ వర్గం మీడియా
•సీఎం ప్రత్యేక(ఆర్థిక) కార్యదర్శి దువ్వూరి కృష్ణ

ఏపీ ఆర్థిక పరిస్థితిపై రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా అసత్యాలు మాట్లాడుతున్నాయని, గతంతో పోలిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని సీఎం ప్రత్యేక(ఆర్థిక) కార్యదర్శి దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తోందనడానికి ఏవిధమైన ఆధారాలు లేవని, అయినా ఓ వర్గం మీడియా వాస్తవాలకు భిన్నంగా తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా ఉందని, ఈ అంశాలపై ప్రజలకు వాస్తవ వివరాలను వెల్లడించడం తమ బాధ్యతగా పేర్కొన్నారు. వెలగపూడిలోని సచివాలయం ఐదో బ్లాక్ లో మంగళవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం ప్రత్యేక(ఆర్థిక) కార్యదర్శి దువ్వూరి కృష్ణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదిక ఆధారంగా వాస్తవ వివరాలను వెల్లడించారు.


2014 నుంచి 2019 వరకు ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందని వివరించారు. ఈ అప్పులు సగటు కన్నా రూ.48వేల కోట్లు అధికంగా ఉన్నాయని తెలిపారు. వివిధ రాష్ట్రాల ఫిజికల్ డెఫిసిట్, ఫైనాన్షియల్ కమిషన్ నిబంధనల ప్రకారం చూసినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని, పరిమితికి లోబడే రుణ సమీకరణ జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సమీకరించే రుణాలను లెక్కించే సీఏడీఆర్ కన్నా రాష్ట్ర సీఏడీఆర్ తక్కువగా ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అప్పుల నిష్పత్తి కన్నా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల నిష్పత్తి తక్కువగానే ఉందని ఆర్బీఐ ప్రచురించిన నివేదికలో వెల్లడైందన్నారు. 2014 నుంచి 2019 వరకు కేంద్ర ప్రభుత్వం సీఏడీఆర్ రుణాలు 9.89 శాతం పెరిగాయని, అదే సీఏడీఆర్ రుణాలు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 19.02 శాతం పెరిగిందని, అందుకు అనుగుణంగా అధిక మొత్తంలో అప్పలు తెచ్చుకున్నారని తెలిపారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం సీఏడీఆర్ రుణాలు 13.85శాతం పెరిగితే, రాష్ట్ర ప్రభుత్వ సీఏడీఆర్ రుణాలు అంతకంటే తక్కువగా 13.55 శాతంగా ఉందని వెల్లడించారు. గతంలో కంటే మెరుగ్గా ఉన్న ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేయడం తగదని దువ్వూరి కృష్ణ ఓ వర్గం మీడియాకు సూచించారు.


“గత ప్రభుత్వం ఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు, 9 ఏప్రిల్, 2019న ఒకే రోజున SDL వేలం ద్వారా రూ.5వేల కోట్లు అప్పుగా తెచ్చింది. ఇది బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఒకే రోజు గరిష్ఠ మొత్తంలో అప్పులు తేలేదని ఇదే అత్యధిక రుణం కావచ్చు.” అని దువ్వూరి కృష్ణ వివరించారు.
“5 సంవత్సరాల టిడిపి పాలనలో అప్పులు 138.84% పెరిగాయి. ఇది 2014-19లో 19.02% అప్పుల వార్షిక వృద్ధి రేటుకు అనువదిస్తుంది. దానికి విరుద్ధంగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం కేవలం 62.78% మాత్రమే పెరిగాయి. ఇది 2014-19లో 13.55% అప్పుల వార్షిక వృద్ధి రేటుకు అనువదిస్తుంది, ”అని కృష్ణ వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రెట్టింపు అయ్యాయన్న ప్రతిపక్షాల వాదనలను ప్రత్యేక కార్యదర్శి ఖండించారు. RBI నివేదికను ప్రస్తావిస్తూ, “2014లో, టీడీపీ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రం అప్పులు రూ.1,13,797 కోట్లు ఉండగా, RBI నివేదిక ప్రకారం ఇది 2019 నాటికి రూ.2,71,797.56 కోట్లు పెరిగింది. ఇది 238శాతం పెరిగినట్లుగా ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. దీనితో పోలిస్తే , ప్రస్తుత ప్రభుత్వం 4 సంవత్సరాలలో రెండింతలు అప్పు పెరిగిందన్నది అవాస్తవం. పెరిగిన అప్పులు కేవలం 62.78శాతం మాత్రమే.” అని దువ్వూరి కృష్ణ స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఖజానాపై అప్పు భారాన్ని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు.. సంక్షేమానికి వెచ్చిస్తున్న ఖర్చుపై నిజానిజాలు చూసుకోకుండా విషం చిమ్మడం, అసత్యాలు ప్రచారం చేయడం శోచనీయమని అని కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.