Home Page SlidermoviesNationalNews

‘కిస్సిక్’ పాట వెనుక స్టోరీ ఇదే..దేవీశ్రీ

‘పుష్ప-2’ చిత్రంలోని ‘కిస్సిక్’ సాంగ్‌ గురించిన స్టోరీని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఒక ఇంటర్యూలో పంచుకున్నారు. పుష్ప- 2లోని ప్రతీ పాట డిఫరెంట్ కేటగిరీలో ఉండాలని డైరక్టర్ సుకుమార్ నిర్ణయించారు. కథ, సన్నివేశాలు వినేటప్పుడు ప్రతీ సీన్ ఇంటర్వెల్ సీన్‌లాగే అనిపించిందట. ‘పుష్ప’ 1లో సూపర్ హిట్ అయిన ‘ఊ అంటావా మావా’ పాటతో అభిమానులు దీన్ని పోల్చి చూస్తారని తెలుసు. అందుకే అంతటి హిట్ కావాలనే ఉద్దేశంతోనే ఈ పాటను రూపొందించాం. ‘కిస్సిక్’ అనే పదం స్క్రిప్ట్‌లో ఉంది. దానితో పాట వచ్చేలా ప్లాన్ చేశారు రచయిత చంద్రబోస్. ‘కిస్..కిస్..కిస్…కిస్సిక్’ అంటూ బీట్ మొదలుపెట్టి ఫోటోల గురించిన సోషల్ మెసేజ్‌తో ఈ పాటను రూపొందించారు. ఈ పాటను ఫోన్ కాల్ కాన్ఫరెన్స్‌లో చర్చించుకుని ఓకే చేసుకున్నాం అని వివరించారు.