Home Page SliderNational

“ఇది జడ్జీలకు ఆందోళన కలిగించే విషయమే”..సీజేఐ చంద్రచూడ్

కేసుల పరిష్కారంలో జాప్యంపై ప్రజలు విసిగిపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. న్యాయప్రక్రియపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇది జడ్జిలకు ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.  కోర్టుల్లో కేసులు తేలక ప్రజలు సత్వర పరిష్కారం కోసం సెటిల్మెంట్‌లు కోరుకుంటున్నారన్నారు. కేసుల సెటిల్‌మెంట్‌లో లోక్ అదాలత్‌లది ప్రముఖ పాత్ర అని, ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకున్న కేసులకు అప్పీలు ఉండదని తెలిపారు. నేడు సుప్రీంకోర్టులో జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.