ఇది బీఆర్‌ఎస్ తెచ్చిన కరవే: మంత్రి సీతక్క
తెలంగాణ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే వర్షాలు కురవడం ఆగిపోయాయని ఆమె అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెరువుల పూడికతీతకు రూ.వేల కోట్లు ఖర్చు చేసింది. మరి ఇప్పుడు ఆ చెరువుల్లో నీళ్లు ఎందుకు లేవు. ఆ కరవు బీఆర్‌ఎస్ తీసుకొచ్చిందే అని ఆమె అన్నారు.

