Breaking NewsHome Page SliderNationalNews Alert

ఢిల్లీలో బాంబు బెదిరింపులు కారణం ఈ అబ్బాయా..

దేశ రాజధాని నగరం కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపు దాడులతో హోరెత్తిపోతోంది. అయితే దీనిపై నిఘా పెట్టిన పోలీసులకు ఈ బెదిరింపులకు కారణం కేవలం 12 ఏళ్ల బాలుడని తెలిసింది. గతంలో బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకోలేకపోయాలనే కోపంతో ఈ బాలుడు ఇలా మెయిల్స్ పెట్టినట్లు చెప్పాడు. అతడికి, అతడి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. అయితే శుక్రవారం కూడా అర్థరాత్రి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ వంటి  30 విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. తనిఖీలు చేసిన పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనలో మెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా ఈ బాలుడిని పట్టుకున్నారు.