Andhra PradeshNews

రైతులకు ఈ ఏడాది పుష్కలంగా నీళ్లు- జల మంత్రి అంబటి

Share with

నదులన్నీ జలకళను సంతరించుకోవడం సంతోషం ఈ యేడాది రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామన్నారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. వర్షాకాలం తొలి దశలోనే నదులన్నీ జలకళను సంతరించుకోవడం సంతోషకరమని ఈ ఏడాది రైతాంగానికి నీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు తో కలిసి అంబటి పులిచింతల ప్రాజెక్టు 14వ గేట్లు ఎత్తి26000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. వర్షాకాలం కావడం ఎగువ నుండి వరద రావటం దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులో 45 టీఎంసీల సామర్థ్యం ఉన్నప్పటికీ 40 టీఎంసీల నీరు నిల్వ ఉంచి మిగులు నీటిని దిగువకు వదులుతున్నామన్నారు.

ఎగువ నుండి వరద అధికంగా ఉంటే మరొక గేటు తక్కువగా ఉంటే గేట్లు మూసివేయడం జరుగుతుందన్నారు. భద్రత దృష్ట్యా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గత సంవత్సరంలో కొట్టుకుపోయిన 16వ నెంబర్ గేటు అమర్చేందుకు 7.5 కోట్లు రూపాయలకు టెండర్లు పిలిచామన్నారు. ప్రాజెక్టు మరమ్మతులకు 9.5 కోట్ల రూపాయలు కూడా కేటాయించామన్నారు. మరమ్మత్తుల పనులను త్వరలోనే ప్రారంభిస్తారన్నారు. మాదిపాడు నుండి పులిచింతల వద్దకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విలేఖరి అడిగిన ప్రశ్నకు మంత్రి అంబటి రాంబాబు బదులిస్తూ ఈ రహదారి పై స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు 65 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వచ్చారని మొదటి విడతగా 35 కోట్ల రూపాయలు నిధులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుమతులు ఇచ్చారని త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభం కానున్నట్లు మంత్రి తెలిపారు.