NationalNews

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మళ్లీ ప్రమాణస్వీకారం… 8 సారి కీలక పదవి

Share with

బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నితీష్ కుమార్ తన పదవికి ముప్పురాకుండా మరో వ్యూహాన్ని అమలు చేశారు. బీహార్ కు వరుసగా 8 సారి ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 9 ఏళ్లలో బీజేపీని రెండోసారి కాదని, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ నితీష్-ఆర్జేడీ చీఫ్ తేజీస్వీ గవర్నర్ ను కోరగా… అందుకు ఆయన అంగీకరించారు. కొత్త కూటమిలో 7 పార్టీలు కలిసి భాగస్వామ్యులు కాబోతున్నాయ్. ఈ కూటమికి 164 మంది శాసనసభ్యులున్నారు. ఈ సారి నితీష్ కుమార్ ఆర్జేడీకి కీలక పదవులు ఇవ్వబోతున్నారు. స్పీకర్ పోస్టుతో సహా, తేజస్వీని డిప్యూటీ సీఎం చేసేందుకు అంగీకరించారు. అదే సమయంలో లాలూ మరో కుమారుడికి సైతం కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అని తెలుస్తోంది.