వారంత చికెన్, గుడ్లు తినవచ్చు..
బర్డ్ ఫ్లూతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం తణుకు మండలం వేల్పూరులోని బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందిన కోళ్ల ఫారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కిలోమీటర్ పరిధిలోని ఐదు కోళ్ల ఫారాల్లో సుమారు 20వేల కోళ్లను బతికుండగానే పూడ్చి పెడుతున్నట్లు చెప్పారు. పది కిలోమీటర్ల విస్తీర్ణం బయట ఉన్న ప్రజలు చికెన్, గుడ్డు తినవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

