Home Page SliderTelangana

డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండ్రు..

ప్రజల వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ నేతలు పద్మ అవార్డులపై మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంట్రవర్సీ రాజకీయాలు చేయడానికి రాష్ట్రంలో రేవంత్ కు అధికారం ఇవ్వలేదని పాయల్ శంకర్ ఫైర్ అయ్యారు. నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 4 స్కీంలు ప్రారంభిస్తామని గొప్పగా చెప్పారు. మండలంలోని ఒక గ్రామంలో మాత్రమే పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.