తెలంగాణాలో భారీగా పెరిగిన కరోనా కేసులు
మన సర్కార్ న్యూస్ : మరోసారి తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య 1000కి పైన నమోదైంది. గడిచిన కొన్ని వారాల తర్వాత వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గడిచిన 24 గంటల్లో 44,202 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,054 మందికి పాజిటివ్ గా నమోదు అయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 396, రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 60, నల్గొండ జిల్లాలో 49, కరీంనగర్ జిల్లాలో 46 కేసులుగా గుర్తించారు. మరోవైపు 795 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 8,21,671 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,11,568 మంది కోలుకున్నారు. ఇంకా 5,992 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.