రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు
తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలుగు రాష్ర్టాల మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలో మరో 3 రోజులపాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు తెలంగాణలోనూ రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు కోస్తాలోనూ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.