Andhra PradeshNewsNews Alert

చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు…విడుదల చేయనున్న సీఎం జగన్

Share with

జగనన్న తోడు పధకం కింద నేడు లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నోక్కి నేరుగా రూ.10 వేలు జమ చేయనున్నారు.3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.395 కోట్ల రుణాలను అందించనున్నారు

జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం నేడు పంపిణీ చేయనుంది. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికిఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున గత ఆరు నెలల్లో అందించిన రూ.395 కోట్ల వడ్డీలేని రుణాలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీ మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్‌ బటన్ నోక్కి నేరుగా రూ.10 వేలు జమ చేయనున్నారు.గత ఆరు నెలల్లో ఇచ్చిన రూ.395 కోట్లతో కలిపి పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు15.03 మంది లబ్ధిదారులకు రూ.2,011 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. రుణం తీర్చిన లబ్ధిదారులు మళ్లీ వడ్డీలేని రుణం పొందేందుకు అర్హులని తెలిపింది. పథకం ప్రారంభించాక ఇప్పటివరకు 5,07,533 మంది సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి తీసుకున్నారని పేర్కొంది. అర్హత కలిగి జాబితాల్లో పేర్లు నమోదు కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..గ్రామ, వార్డు వాలంటీర్లను సంప్రదించి సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది