మాదాపూర్ రియల్ ఎస్టేట్ వివాదంలో కాల్పుల్లో ఒకరు మృతి
మాదాపూర్‌లో రియల్ ఎస్టేట్ వివాదం కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ దందాలకు సంబంధించి రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇటువంటి వ్యవహరంలోనే మాదాపూర్ సమీపంలోని నీరూస్ చౌరస్తాలో కాల్పులు జరిగాయి. ఓ పథకం ప్రకారం దుండగులు కాల్పులు జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా హైదరాబాద్‌కు చెందిన ఇస్మాయిల్, మహమ్మద్‌ల మధ్య ఓ స్థలానికి సంబంధించి ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ వివాదం నెలకొంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇస్మాయిల్‌ను మదాపూర్ సమీపంలోని నీరూస్ దగ్గరికి మహ్మద్ పిలిచినట్టు సమాచారం. ఇది నమ్మి వివాదాన్ని పరిష్కారించుకునేందుకు ఇస్మాయిల్ , జహంగీర్ మరికొద్ది మంది స్నేహిలులతో కలిసి అక్కడకి చేరుకున్నారు. మహ్మద్ , ఇస్మాయిల్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే రౌడీషీటర్ మహ్మద్ , ఇస్మాయిల్ పై ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ఇది గమనించిన మహ్మద్ ఫ్రెండ్ జిలానీ , మరో వెపన్‌తో ఇస్మాయిల్ పక్కన ఉన్న తమని చెదరగొట్టే ప్రయత్నం చేశారన్నారు .
ఈ కాల్పుల్లో ఇస్మాయిల్‌తో కూడా వచ్చిన తమ స్నేహితుడు జహంగీర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయని సమాచారమిచ్చారు. కాల్పుల అనంతరం తీవ్ర గాయాలపాలైన ఇస్మాయిల్ , జహంగీర్‌లను వైద్యం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఇస్మాయిల్ చనిపోగా , జహంగీర్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.