Home Page SliderTelangana

భార్య బాగోతం తెలిసి భర్త ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి అవినీతి బండారాన్ని కట్టుకున్న భర్త బయట పెట్టడం సంచలనంగా మారింది. తన భార్య అవినీతి చేస్తుందంటూ భర్త శ్రీపార్ సోషల్ మీడియాలో నోట్ల కట్టల వీడియోలు విడుదల చేశాడు. జ్యోతి నిత్యం లక్షల్లో లంచం తీసుకుంటుందని, ఏడేండ్ల నుంచి లంచం తీసుకోవద్దని వద్దని వారించినా భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడం తనని మనోవేదనకు గురి చేస్తుందంటూ పేర్కొన్నాడు. లంచం మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చినా… డబ్బులు తీసుకోకుండా ఇంటికి వచ్చేది కాదు. దాదాపు రూ.80 లక్షల విలువైన నోట్ల కట్టలు ఇవే సాక్ష్యాలు’ అంటూ వీడియోల్ని విడుదల చేశారు. ఇదే విషయంలో జ్యోతితో గొడవ పడ్డానని, అయినా తనలో మార్పురాలేదన్నారు. చివరికి భార్య చేస్తున్న తప్పును తట్టుకోలేక ఈ వీడియోలు తీసినట్లు జ్యోతి భర్త విడుదల చేసిన వీడియోలో తెలిపారు.