Andhra PradeshHome Page Slider

విషాదాంతమైన నర్సాపురం ఎంపీడీఓ అదృశ్యం

నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం విషాందాంతమైంది.కాగా ఈ రోజు ఏలూరు కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది. అయితే వెంకటరమణ మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించినట్లు తెలుస్తోంది.వెంకటరమణ 8 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన బోటింగ్ కాంట్రాక్టర్ రూ.55 లక్షలు చెల్లించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఆ ఒత్తిడితోనే తాను ఆత్యహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు ఆయన మెసేజ్ పంపించినట్లు సమాచారం. అయితే ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.