ఉత్తరాదిలో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు..
ఉత్తరాది రాష్ట్రాలను చలి తీవ్రత వణికిస్తోంది. దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలలో మంచు దట్టంగా కురుస్తోంది. దీనితో పొగమంచు కారణంగా పలు రవాణా సౌకర్యాలకు ఆటంకం ఏర్పడింది. ఇప్పటికే ఢిల్లీలో ఉష్ణోగ్రత 7 డిగ్రీల కంటే తగ్గిపోయింది. మరోపక్క కాశ్మీరులో మైనస్ ఉష్ణోగ్రతలతో మంచు పేరుకుపోతోంది. దీనితో విమానాలకు, రోడ్డు, రైల్వే రవాణాలకు ఆటంకం ఏర్పడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో విజిబిలిటీ 50 మీటర్లకు తగ్గిపోయింది. దీనితో విమాన ప్రయాణాలు తాత్కాలికంగా రద్దయ్యే, లేదా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రాజధానిలో మంచు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోనే కాక ఉత్తరప్రదేశ్, హిమాచల్ వంటి ఇతర రాష్ట్రాలలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అలాగే బిహార్, పంజాబ్, రాజస్థాన్, హరియాణాలలో కూడా దట్టంగా మంచు కురుస్తోంది. ఢిల్లీ, నోయిడాలలో పాఠశాలలకు జనవరి 8 వరకూ సెలవులు ప్రకటించారు.

