Andhra PradeshNews

175 సీట్లు సాధించడమే లక్ష్యంగా…

Share with

‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రిజనల్‌ కోఆర్డినేటర్లు,జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం మార్గనిర్దేశం చేశారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత ఎంతో ముఖ్యమన్న సీఎం.. జీవితంలో ఏ కార్యక్రమమైనా నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకోగలమన్నారు.మునుపటి కన్నా మెరుగైన ఫలితాలు సాధించాలని.. 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్యెల్యేలకు సీఎం జగన్ సూచించారు.రాష్ట్రంలో 87శాతం కుటుంబాలకు పథకాలు అందించామని,లబ్ధిదారుల మద్దతు పొందితే.. 175 స్థానాల్లోనూ గెలవగలం అని సీఎం జగన్ అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించామని.. వచ్చే ఎన్నికల్లో అక్కడా విజయం సాధించాలన్నారు.ఎలాంటి వివక్షలేకుండా, అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నాం అని తెలిపారు.పథకాలకు బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే పంపుతున్నామన్నారు. చేయాల్సింది అంతా చేస్తున్నానని, ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలని సీఎం సూచించారు.

ప్రతినెలా క్యాలెండర్‌ ఇచ్చి.. ఎలాంటి పరిస్థితులు ఉన్నా పథకాలకు బటన్‌ నొక్కుతున్న, ప్రతి ఒక్కరికీ మంచి చేయడాన్ని నా ధర్మంగా..నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానన్నారు… దీనివల్ల ఒక వాతావరణం, ఒక ఫ్లాట్‌ఫాం క్రియేట్‌ అయ్యిందన్నారు. సంక్షేమ పథకాలను సకాలంలో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఎమ్మెల్యేల బాధ్యత అని తెలిపారు. ఎమ్మెల్యేలు చేయాల్సింది చేస్తేనే ఫలితాలు సాధిస్తాం.. ఇద్దరం కలిసికట్టుగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతామన్నారు. ఎమ్యెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జీవో ఇచ్చామన్నారు.

ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నిధులు ఇస్తామని సీఎం తెలిపారు. సచివాలయం విజిట్‌ పూర్తయిన వెంటనే కలెక్టర్లు నిధులిస్తారని…ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు .ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు మళ్లీ జీవో కూడా ఇచ్చామన్నారు జగన్.గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలని ఆదేశించారు. వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు.. గరిష్టంగా 21రోజులు గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు జగన్.