మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ క్రికెటర్
టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్,చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రూతురాజ్ గైక్వాడ్ మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఆయన ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆమె ఎవరో కాదు పూణేకు చెందిన ఉమెన్ క్రికెటర్ ఉత్కష్ట పవార్. అయితే గతకొంతకాలంగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఈ ప్రేమబంధాన్ని వివాహబంధంగా మలచుకుంటున్నారు. కాగా ఈ నెల 3వ తేదిన పెళ్లితో వీరిద్దరు ఒక్కటవ్వబోతున్నారు. రెండు రోజుల కిందట ముగిసిన IPL ఫైనల్ మ్యాచ్‌లో CSK టీమ్ కప్పును కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా CSK ప్లేయర్స్ తమ కుటుంబాలతో కలిసి స్టేడియంలో సందడి చేశారు. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ తనకి కాబోయే భార్యను ఉత్కష్ట పవార్‌ను టీమ్ సభ్యులందరికీ పరిచయం చేశారు. దీంతో CSK టీమ్ ప్లేయర్స్ రుతురాజ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే రుతురాజ్ ఈపెళ్లి కారణంగా ఇప్పటికే WTC పైనల్‌కు దూరమయ్యారు. కాగా అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తేలిసిందే.

