Home Page SliderNationalPolitics

దేశంలో పరిస్థితులు బాలేవు..మీరక్కడే ఉండండన్న ఆర్జేడీ నేత

ఆర్జేడీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీహార్‌ మాజీ మంత్రి అబ్దుల్‌ బారీ సిద్దిఖీ  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారత దేశంలో పరిస్థితులు బాగోలేవని, అందుకే తన పిల్లల్ని విదేశాల్లో స్థిరపడాలని ఆర్జేడీ నేత సూచించారన్నారు. ముస్లింలపై వివక్ష ఉందన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తన కొడుకు హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడని, కూతురు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిందని ఆయన చెప్పారు.  విదేశాల్లోనే ఉద్యోగాలు చూసుకోవాలని.. వీలైతే అక్కడే స్థిరపడాలని తాను చెప్పానని తెలిపారు. తన మాటలకు వారు ఆశ్చర్యపోయారని, తాను చెప్పింది విశ్వసించలేకపోయారన్నారు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను మీరు భరించలేరని వారికి తాను చెప్పానన్నారు. దీనిపై బీహార్‌ బీజేపీ పార్టీ తీవ్రంగా మండిపడ్డారు. సిద్ధిఖీ వ్యాఖ్యలు భారత్‌పై వ్యతిరేకతను చాటుతున్నాయన్నారు. ఈ దేశంలో నివసించడం ఆయనకు అంత కష్టంగా ఉంటే.. ఇక్కడ పొందే సౌలభ్యాలన్నీ వదిలి పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని సూచించారు. ఆయన ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సన్నిహితుడు.