ఏపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు: మంత్రి తలసాని
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల తెలంగాణా విద్యా వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తెలంగాణా మంత్రులు,నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే దీనిపై తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..ఏపీలో వాళ్ల పరిస్థితులు బాగోలేవన్నారు. మా గురించి మాట్లాడే .. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకోండి అని తెలిపారు. అయితే మా రాష్ట్రం గురించి యావత్ దేశమే మాట్లాడుకుంటుందన్నారు. అసలు బొత్స మా రాష్ట్రం గురించి ఎందుకు,దేనికి మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మీ ఏపీ పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. కాబట్టి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

