Andhra PradeshNews Alert

వైఎస్ విజయమ్మకు తృటిలో తప్పిన ప్రమాదం

కర్నూల్‌లో వైఎస్ విజయమ్మకు పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి.ఈ రోజు కర్నూల్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్నేహితుడిని పరామర్శించడానికి విజయమ్మ ఉదయం కర్నూల్‌కు వెళ్ళారు.అక్కడ వైఎస్  మిత్రుడు అయ్యప్పరెడ్డి కుటుంబాన్ని సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో ఆమె కారు టైరు పేలింది.

ఈ నేపథ్యంలో ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి వైఎస్ విజయమ్మ క్షేమంగా బయటపడ్డారు.గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.వైఎస్ విజయమ్మ కారు డ్రైవర్ సమయానికి చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ ఘోర ప్రమాదం తప్పిందని తెలుస్తోంది.