“ఏపీలో అధికారపక్షం వైసీపీకి భయపడుతోంది”: వైఎస్ జగన్
ఏపీ మాజీ సీఎం జగన్ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జగన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మైక్ ఇస్తే నిలదీస్తారనే భయంతోనే..మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. కాగా మాకు మైక్ ఇస్తే అధికార పక్షం తప్పులు బయట పడతాయన్నారు.అందుకే అధికారపక్షం వైసీపీకి భయపడుతుందని జగన్ పేర్కొన్నారు.

