Home Page SliderNationalNews Alert

బైకర్‌ మెడకు చుట్టుకున్న తాడు.. గాల్లో ఎగిరిపడిన యువకుడు

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మెడకు లోడ్‌ లారీ నుంచి వేలాడుతున్న తాడు చుట్టుకుంది. దీంతో అతడు బైక్‌పై నుంచి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీవైకుంఠం పట్టణానికి చెందిన ముత్తు అనే వ్యక్తి తన బైక్‌పై పనికి వెళ్తున్నాడు. ఉరల్‌ ప్రాంతం వద్ద ఎరువుల లోడ్‌తో వెళ్తున్న లారీ నుంచి ఒక ఎరువుల బస్తా రోడ్డుపై పడింది. ఆ బస్తాకు చుట్టుకుని లారీ నుంచి వేలాడిన తాడై బైక్‌పై వెళ్తున్న ముత్తు మెడకు చుట్టుకుంది. దీంతో అతడు బైక్‌పై నుండి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఈ ప్రమాదంలో ముత్తుకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.