NewsTelangana

కాసేపట్లో మునుగోడు ఫలితం

మధ్యాహ్నం 11 గంటలకు రానున్న ఫుల్ క్లారిటీ
మునుగోడు ఉపఎన్నిక ఫలితం కోసం ఉత్కంఠ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉప సమరం
మునుగోడులో రసవత్తరంగా సాగిన ఎన్నిక

మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత రౌండ్ల వారీగా లెక్కింపు కొనసాగనుంది. మొత్తం 298 పోలింగ్ బూత్‌లను 15 రౌండ్లుగా అధికారులు విభజించారు. ఒక్కో రౌండ్‌లో 21 బూత్‌లు కవర్ అవుతున్నాయ్. తొలి రౌండ్ ఫలితం తొమ్మిదిన్నర తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఇక మునుగోడు ఎన్నికలో అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ హోరాహోరీ తలపడ్డాయ్. ఎన్నిక ఆరంభం నుంచి పోలింగ్ జరిగే వరకు నువ్వా-నేనా అన్నట్టుగా వ్యవహరించాయి. ఈ ఎన్నికలో గెలిచి బీఆర్ఎస్ పార్టీని పట్టాలెక్కించాలని కేసీఆర్ తలపొస్తుంటే.. మునుగోడు విజయం ద్వారా కేసీఆర్‌కు తెలంగాణలోనే చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరువు దక్కించుకునేందుకు ఎంతగానో ప్రయత్నించింది. మునుగోడులో డిపాజిట్ రాకుంటే ఏమవుతుందోనన్న వర్రీ ఆ పార్టీని వెంటాడుతోంది.