చంద్రబాబు వేలి ఉంగరం అసలు స్టోరీ
ఉంగరాలు, కడియాలు వంటివి ఎప్పుడూ ధరించని చంద్రబాబు చేతి వేలికి ఉన్న ఓ ఉంగరం పార్టీ కార్యకర్తల్లో ఆశక్తి రేపుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో… పార్టీ కార్యాకర్తలకు చంద్రబాబు అభివాదం చేసే సమయంలో వేలికి కొత్తగా ఓ ఉంగరం ఉండటాన్ని గమనించారు అభిమానులు. ఇంకేముంది… బాబు గారి ఉంగరంపై రకరకాల చర్చలు, ఊహాగానాలు బయలుదేరాయి. నేడు రాజంపేట అసెంబ్లీ నియోజవకర్గం సమీక్షలో ఇదే అంశాన్ని కార్యకర్తలు ప్రస్తావించగా… తాను వేసుకున్నది ప్లాటినం ఉంగరమని, అందులో ఉన్న మైక్రో చిప్ తన ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎప్పటికపుడు సేకరించి, ఇంట్లో ఉన్న కంప్యూటర్‌కు పంపుతుందని, తన హార్ట్ బీట్, నిద్ర వంటి అనేక అంశాలను సంబంధించిన సమాచారాన్ని మరుసటి రోజు ఉదయం కంప్యూటర్‌లోని డేటా చూసుకుంటే… ఎక్కడైనా పొరపాటు జరిగిందా అన్నది తెలుస్తుందని.. దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు చంద్రబాబు. ఇలాంటి పరికరాలు మార్కెట్‌లో చాలా వచ్చాయని అన్నారు. అయినా.. కార్యకర్తలు అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది తన లక్ష్యమని, కార్యకర్తలు ఆరోగ్యంగా ఉంటే తన ఆరోగ్యం బాగుంటుందని.. మన అందరం ఆరోగ్యంగా ఉంటేనే… టీడీపీ ఆరోగ్యం బాగుంటుందని పేర్కొన్నారు చంద్రబాబు….