InternationalNews

జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు, పరిస్థితి విషమం

జపాన్ మాజీ ప్రధానిపై దుండగడు కాల్పులు జరిపారు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న షింజో అబేను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి గాయపర్చారు. షింజేను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ఎలాంటి కదలికలు లేవని ఆయన సన్నిహితులు తెలిపారు. షింజో అబే పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అబే కార్డియో పల్మనరీ అరెస్టు స్టేటస్‌లో ఉన్నారని… అధికారులు చెబుతున్నారు. జపాన్‌లో ప్రముఖుల మరణానికి ముందు ఇలాంటి పదాన్ని ఉపయోగిస్తుంటారు.