NationalNews

దేశమంతటా ఒకే ధర… భారీగా తగ్గునున్న వంట నూనెల ధరలు

Share with

అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నందున దేశీయంగా వంట నూనెలపై రూ.10 వరకు తగ్గించాలని వంట నూనె తయారీ సంస్థలను కేంద్రం ఆదేశించింది. అలాగే బ్రాండ్ ఆయిుల్‌పై దేశవ్యాప్తంగా ఓకే ధర ఉండాలని సూచించింది. వంటనూనె తయారీ సంస్థలను అసోసియేషన్లతో బుధవారం కేంద్ర ఆహర శాఖ కార్యదర్షి సుధాంశు పాండే స్పష్టం చేసారు. గడిచిన వారం రోజుల్లో అంతర్జాతీయంగా వంట నూనె ధరలు 10 శాతం తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదాలాయించాలన్నారు. ప్రస్తుత దేశీయ అవసరాల కోసం 60 శాతానికి పైగా దిగుమతలపైనే ఆధారుపడి ఉన్నాం. దీంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడల్లా… స్థానికంగానూ రేట్లు పెరుగుతున్నాయ్. ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలవో ఓవైపు చమురు ధరలు, మరోవైపు వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయ్. రష్యా, ఉక్రెయిన్‌లో పేరుకుపోయిన సన్ ఫ్లవర్ ఆయిల్ ఎగుమతి జరక్కపోవడంతో… రేట్లు అమాంతంగా పెరిగిపోయాయ్. ఓవైపు కొరత, మరోవైపు అధిక ధరలతో ప్రపంచ వ్యాప్తంగా సమస్య ఎదురయ్యింది. గత నెలలో నూనె ధరను లీటర్‌కు 10 -15 వరకు తగ్గించామని కంపెనీలు కేంద్రానికి వివరించాయ్. ఐతే… నూనె ధరలు మరింత తగ్గించాలని కేంద్రం వంట నూనె తయారీ సంస్థలకు స్పష్టం చేసింది.