Andhra PradeshHome Page SliderNews AlertTrending Today

ఉగ్రమూలాల కేసులో కీలక ఆధారాలు..లోతుగా ఎన్‌ఐఏ దర్యాప్తు

ఉగ్రవాద మూలాలున్న యువకులు సిరాజ్, సమీర్‌లను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ బృందం ఈ కేసులో కీలక ఆధారాల సేకరణకు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ పేలుళ్ల కుట్రకు వ్యూహం రచించిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్‌కు చెందిన పలు కీలక ఆధారాలు సేకరించారు. అతని తండ్రి పోలీస్ శాఖలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. తన కుమారులను కూడా పోలీసు అధికారులుగా చేయాలనుకుంటే సిరాజ్ నాలుగేళ్లపాటు శిక్షణ తీసుకున్నా కూడా ఎంపిక కాలేకపోయాడు. గ్రూప్ 2 ప్రయత్నాలలో ఉండగా, హైదరాబాద్ వచ్చి బోయగూడకు చెందిన సమీర్ పరిచయంతో వరంగల్‌, యూపీలకు చెందిన పలువురితో పరిచయాలు ఏర్పడ్డాయి. గతేడాది ముంబయి వెళ్లి 10 మందిని కలిశాడు. ఇటీవల ఢిల్లీకి వెళ్లగా, వారు అందుబాటులో లేరు. సౌదీలోని అబు ముసాబ్‌తో సమీర్, సిరాజ్‌లు సిగ్నల్ యాప్ ఉపయోగించి, మాట్లాడుకున్నారు. తక్కువ ఖర్చుతో బాంబులు తయారు చేసి, జనసమర్థం ఉండే ప్రాంతంలో ప్రయోగిద్దామనుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు.