‘మోదీ ఎందుకు నంబర్ ఒన్’ తేల్చి చెప్పిన ‘ది న్యూయార్క్ టైమ్స్’
ప్రపంచ నేతలలో భారత ప్రధాని నరేంద్రమోదీకే ‘ఫస్ట్ ర్యాంక్’ అంటూ ప్రకటించింది ది న్యూయార్క్ టైమ్స్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మోదీ పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఏ దేశ ప్రధానికీ, అధ్యక్షుడికీ లేనంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి మోదీ అని తేల్చి చెప్పింది. దీనికి గల కారణాలను కూడా వెల్లడించింది. డిజిటల్ మీడియా రంగంలో ప్రజలను ఆకట్టుకునేలా చెప్పగలిగే ఆయన వాక్చాతుర్యమే ఆయన విజయానికి కారణమని తెలియజేసింది. మోదీ ప్రతీనెలా నిర్వహించే ‘మన్ కీ బాత్ ‘ దేశ క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయనకున్న అవగాహనను తెలియజేస్తోంది. భారతీయతపై ఆయనకున్న ప్రేమకు, ప్రజలపై ఆయనకు గల శ్రద్ధకు ఇది నిదర్శనమని పేర్కొంది. ట్విటర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య దాదాపు 8.95 కోట్లు. మరే నేతకూ ఇలాంటి ఫాలోయింగ్ లేదు. ఎలాంటి విషయమైనా ‘అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు’ చెప్పగలిగే నైపుణ్యం ఆయన సొంతం. వ్యవసాయం నుండి అంతరిక్షం వరకూ, ఆధ్యాత్మికత నుండి సాంకేతికత వరకూ, విద్యార్థుల నుండి శాస్త్రవేత్తల వరకూ ఎవరితో ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో ఆయనకే తెలుసు. ఆయన దేశవ్యాప్తంగా విమర్శలకు అతీతంగా అందరికీ చేరువయ్యారని వ్యాఖ్యానించింది న్యూయార్క్ టైమ్స్.

