భారత్‌లో కొత్త వేరియంట్… ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్
భారత్‌లో కరోనా కొత్త సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF-7 ను గుర్తించారు. తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్ నెలలోనే గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 3 నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్‌లో రెండు కేసులు నమోదు కాగా మరో కేసు ఒడిశాలో వెలుగు చూసినట్లు తెలిపాయి. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులకు హై అలర్ట్ జారీ చేసింది కేంద్రం. దేశంలోకి వచ్చే వారికి రాండమ్‌గా కరోనా స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశీ ప్రయాణికుల కోసం ఉన్న మార్గదర్శకాలు యథాతథంగా ఉంటాయని తెలిపింది.
BF-7 లక్షణాలు
ఇతర కరోనా వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ BF-7 వేరియంట్ లక్షణాలుంటాయని నిపుణులు వెల్లడించారు.
- ఒళ్లు నొప్పులు అధికంగా ఉంటాయి
- జ్వరం, ముక్కు కారడం
- ఎక్కువగా దగ్గు, గొంతు నొప్పి
- వినికిడి సమస్యలు
- ఛాతిలో నొప్పి రావడం
- వణుకు రావడం
- వాసన గుర్తించకపోవడం

