NewsTelangana

కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు

కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు కొత్త సెక్రటేరియట్‌కు బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేందుకు తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ నామకరణం… యావత్‌ తెలంగాణకు గర్వకారణమని సీఎం కొనియాడారు. అంబేద్కర్‌ పేరు పెట్టడం దేశానికే ఆదర్శమన్నారు. పార్లమెంట్‌ కొత్త భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని  డిమాండ్‌ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. త్వరలోనే ప్రధానికి లేఖ రాస్తానని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.