NationalNews Alert

షూటింగ్‌లో అపశ్రృతి హీరో విశాల్‌కు గాయలు

Share with

“మార్క్ ఆంటోని” షూటింగ్‌లో అపశ్రృతి జరిగింది. అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మార్క్ ఆంటోని షూటింగ్ లో హీరో విశాల్  తీవ్రంగా గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున చెన్నైలో “మార్క్ ఆంటోని” సినిమాలోని కీలక ఫైట్ సీన్స్  షూటింగ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మీడియా చెబుతుంది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల జరిగిన “ లాఠీ ” షూటింగ్‌లోనూ పలుమార్లు గాయపడ్డ విశాల్‌కు మళ్లీ ఇలా జరగడం పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ఆరోగ్యంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కోలివుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో సినిమాల్లో ఎలాంటి రీస్క్ తీసుకోవడానికి అయిన సిద్ధంగా ఉంటారు.