కొత్త పీసీసీ చీఫ్ రేసులో ఉన్నవారి పేర్లు?
టిజి: కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో 4 భర్తీ చేయాలని భావిస్తున్నారట. అటు కొత్త పీసీసీ చీఫ్ రేసులో జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బలరాం నాయక్, సంపత్ కుమార్, మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ ఉన్నట్లు సమాచారం.

