“సలార్” సినిమా సాలిడ్ రికార్డ్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కొత్త సినిమా “సలార్”.కేజీయఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభాస్, ప్రశాంత్ నీల్ పవర్‌ఫుల్ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే అందరు ఊహించినట్లుగానే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది.కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన తొలి రోజే రూ.175 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కోన్నాయి. దీంతో ఈ ఏడాదిలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా “సలార్” రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ సినిమా తర్వాత స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లియో,ప్రభాస్ ఆది పురుష్ సినిమాలు నిలిచాయి. కాగా ఈ సినిమాలు మొదటి రోజు రూ.140 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి.

