నియోజకవర్గాన్ని వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే
పరకాల: జిల్లాల వారీగా పునర్విభజన సమయంలో అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిస్సహాయత వల్ల పరకాల అన్యాయానికి గురైందని, నియోజకవర్గాన్ని వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆదివారం తొలిసారిగా ఆయన పరకాలకు వచ్చారు. తొలుత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో పూజలు చేశారు. కాంగ్రెస్, సీపీఐ నాయకులతో.. స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం మీదుగా బస్ స్టేషన్ వరకు విజయోత్సవ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. గద్వాల, ములుగు వంటివి జిల్లాలుగా ఏర్పడ్డాయని, పోరాటచరిత్ర కలిగిన పరకాల తిరోగమనంలో పయనించిందన్నారు. ఆర్టీసీ బస్సులు తక్కువగా వస్తున్నాయని, త్వరలోనే వాటి సంఖ్యను పెంచేవిధంగా కృషి చేస్తానన్నారు. వారానికి మూడు రోజులు పరకాలలో ప్రజలకు అందుబాటులో ఉండి పెద్దన్నలా వ్యవహరిస్తానన్నారు.

