యూపీలో కాంగ్రెస్ పార్టీ అవుట్
భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ క్రమ క్రమంగా అంతరించిపోతుంది. దేశ వ్యాప్తంగా బీజేపీ వరుస విజయాలతో సుమారు 20 రాష్ట్రల్లో అధికారాన్ని దక్కించుకుంటే… కాంగ్రెస్ మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతుంది. దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా స్వాతంత్ర్యం తెచ్చామనుకునే చెప్పే పార్టీ ఇప్పుడు అస్తిత్వం కోసం పాకుర్లాడాల్సి వస్తోంది. తాజాగా దేశంలో అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ శాసనమండలిలో ఉన్న ఒకే ఒక్క స్థాన్నాన్ని కూడా హస్తం పార్టీ కోల్పోయింది. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ శాసనమండలిలో కాంగ్రెస్ తరుపున ఒక సభ్యుడు ఉండగా బుధవారంతో ఆ ఒక్కడూ పదవీకాలం ముగిసింది. దీంతో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పతనంలో పరాకాష్టకు చేరుకుంటోంది.
ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కూడా రెండంటే రెండు సీట్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలిగింది. ప్రియాంకా గాంధీ కాలుకు బలపం చుట్టుకున్నట్టు ప్రచారం చేసిన ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్ పార్టీని ఓవైపు ప్రజలు, మరోవైపు ఇతర పార్టీలు కూడా నమ్మడం లేదు. దీంతో హస్తం పార్టీతో పొత్తు పెట్టుకోడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ అతి విశ్వాసం… ప్రియాంక గాంధీ చరిష్మా పనిచేయకపోవటం, పేరుకు మాత్రమే సీనియర్లులా కాంగ్రెస్ నేతలు మిగిలిపోయారు. జాతీయ స్థాయిలో పార్టీ బలహీనంగా ఉండడం… ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోకపోవడం… సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉండడంతో ఆ పార్టీ అంతకంతకూ దిగజారిపోతోంది. ముఖ్యంగా ప్రజలకు చేరువకవడానికి అటు పథకాలు లేవు… ఇటు బలవమైన నాయకత్వమూ లేదు… దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది.