Home Page SliderNational

పోలీసులను ముప్ప తిప్పలు పెట్టిన ఇన్నోవా కారు..

ముంబయి నడిరోడ్డుపై ఓ ఇన్నోవా కారు క్రైమ్ పోలీసులను ముప్ప తిప్పలు పెట్టింది. రోడ్డుపై వేగంతో దూసుకెళుతున్న ఇన్నోవా కారు డిక్కీలోంచి మనిషి చేయి బయటకు వేలాడుతూ కనిపించింది. ఆ ఇన్నోవా ను చూసిన జనం డిక్కీలో డెడ్ బాడీ తీసుకెళ్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు ఇన్నోవాను పట్టుకున్నారు ముంబయి పోలీసులు. కారు డిక్కీ ఓపెన్ చేసి చూస్తే అందులోంచి ఓ కుర్రాడు బయటకు వచ్చి ప్రాంక్ వీడియో చేస్తున్నామని అన్నాడు.తమ కంపెనీలో ల్యాప్ ట్యాప్ లు ప్రమోట్ చేయడానికి ఇలా డెడ్ బాడీ మాదిరి ప్రాంక్ వీడియోలు చేస్తున్నామని కుర్రాడు చెప్పాడు. ప్రాంక్ వీడియోలతో జనాలను బెంబేలెత్తించిన కుర్రాడి బ్యాచ్ కి ముంబయి పోలీసులు నాలుగు తగిలించి వార్నింగ్ ఇచ్చి పంపారు.