వేతన జీవులకు భారీ ఊరట…
2023-24 సంవత్సరానికిగానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్రం వేతన జీవులకు ఊరట నిచ్చింది. ప్రస్తుతం ఉన్న 5 లక్షల ఆదాయపు పన్ను పరిమితిని 7 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే.. ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది. అజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం ప్రవేశపెట్టింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ను తీసుకొచ్చింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్టంగా 2 లక్షల వరకు ఈ స్కీములో డిపాజిట్ చేయవచ్చు. మరోవైపు సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్ పరిమితి పెంచింది. ప్రస్తుతం 15 లక్షల వరకు ఉన్న పరిమితిని డబుల్ చేసి 30 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.

