Andhra PradeshHome Page SliderPolitics

డిప్యూటీ సీఎం పదవిపై రచ్చ-ఇరకాటంలో హైకమాండ్

ఏపీ డిప్యూటీ సీఎంగా మంత్రి లోకేష్‌ను నియమించాలంటూ ఇటీవల ఎన్టీఆర్ వర్థంతి సభలో టీడీపీ నేత కోరిన విషయం సంచలనం అయ్యింది. ఈ విషయంపై పలువురు టీడీపీ నేతలను మీడియా ప్రశ్నిస్తుండడం, మరోవైపు జనసేన కార్యకర్తలు దీనికి సెటైర్ వేస్తూ, పవన్‌ను సీఎం చేయాలనడంతో టీడీపీ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. దీనితో హై కమాండ్ సీరియస్ అయ్యింది. ఈ అంశంపై ఇకపై టీడీపీ నేతలు ఎవ్వరూ మాట్లాడకూడదని ఆదేశించింది. ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయరాదని హెచ్చరించింది. కూటమి నేతలతో సంప్రదింపులు లేకుండా ఇష్టారీతిన మాట్లాడకూడదని, వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీపై రుద్దకూడదని పేర్కొంది.