ప్రభుత్వం ఆ పరీక్షలను కూడా వాయిదా వేయాలి
తెలంగాణాలో TSPSC పేపర్ లీక్ వ్యవహరం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం సృష్టించింది.అయితే ఇది జరిగి దాదాపు కొన్ని నెలలు గుడుస్తున్నప్పటికీ దీనిపై ఆందోళనలు మాత్రం సద్దుమణగడం లేదు. ఈ నేపథ్యంలో TSPSC కార్యాలయం వద్ద ప్రతిరోజు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కాగా ఈ రోజు కూడా నాంపల్లిలోని TSPSC కార్యాలయం ఎదుట TSPSC అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ నెల 23,25 తేదిలలో జరగబోయే ఏఈఓ,ఏఎంవీఐ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా లీకైనట్లు తమకు అనుమానం ఉందని వారు ఆరోపిస్తున్నారు. కాగా పరీక్ష వాయిదా వేసి ప్రశ్నాపత్రం మార్చాలని వారు ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలో వారి ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు.

