Home Page SliderTelangana

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో దగా చేస్తున్న కేసీఆర్-ఈటల ధ్వజం

పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇవ్వాలని” భారతీయ జనతా పార్టీ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. సమస్యలకు పరిష్కారం చూపే అడ్డా ధర్నా చౌక్‌ను ఎత్తేసిన నియంత కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. ధకు అనుమతి ఇవ్వకపోవడానికి నీ అబ్బ జాగీరా కేసీఆర్ అంటూ ప్రశ్నించారు ఈటల. GHMCలో లక్షల మంది ఉంటే 500 మందికి పర్మిషన్ ఇస్తారా అంటూ విరుచుకుపడ్డారు. రేకులను అడ్డం పెట్టుకొని ఉండే వాళ్లకు 9 ఏళ్ల 2 నెలల కాలంలో ఇల్లు రాలేదని, మాటలు చెప్పి కేసీఆర్ పేదల కళ్లలో మట్టి కొట్టారన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం IDH కాలనీలో 100 ఇళ్ళు కట్టి.. తెలంగాణ నలుమూలల నుండి ఆడబిడ్డలను తీసుకువచ్చి చూపించారు. నేను పుట్టిందే మీ కోసం అన్నారు. కానీ 9 ఏళ్ళు గడిచిన డబుల్ బెడ్ రూం రాలేదన్నారు. డబుల్ బెడ్ రూం కోసం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న హడ్కో 9 వేల కోట్లు అప్పు ఇచ్చిందన్న ఈటల, రూరల్ అర్బన్ మిషన్ కింద 1311 కోట్లు కేంద్రం మంజూరు చేసిందన్నారు. 9 ఏళ్లలో 20 లక్షల బడ్జెట్ పెట్టిన కేసీఆర్, డబుల్ బెడ్ రూం కోసం ఇచ్చింది మాత్రం 600 కోట్లు మాత్రమేనన్నారు.

కేసీఆర్ సర్కారు 2.91 లక్షల ఇళ్లు మంజూరు చేసి, పేదలకు ఇచ్చినవి 35 వేలు మాత్రమేనన్నారు ఈటల. కట్టిన ఇల్లు పాడుపడిపోతున్నాయన్నా, ఇళ్లను పంచే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. ఇల్లు ఇవ్వని కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. 2014 బడ్జెట్ లక్ష కోట్లని, ఇప్పుడది, అది 3 లక్షల కోట్లకు చేరిందన్నారు. 120 రూపాయలు ఉన్న సిమెంట్ 300 రూపాయలకు చేరిందని, 35 రూపాయలున్న ఐరన్ 65 కు చేరుకుందన్నారు. మేస్త్రీ కూలి రూ. 600 నుండి రూ.1500 అయ్యింది. అదే.. 2014 లో 5 లక్షల రూపాయలు ఇస్తా అన్న కేసీఆర్, 2023లో 3 లక్షల రూపాయలే ఇస్తానంటున్నారని దుయ్యబట్టారు. మూడు లక్షల రూపాయలు బిక్షంలా వేస్తారా అని ప్రశ్నించారు ఈటల రాజేందర్. ఆ పైసలకు కనీసం పునాదులు కూడా పూర్తి కావన్నారు. సచివాలయం 600 కోట్లతో మొదలు పెట్టి 1600 కోట్లతో కట్టారని… ప్రగతిభవన్ రూ. 60 కోట్లతో మొదలు పెడితే రూ. 150 కోట్లు అయ్యిందన్నారు. నీకో న్యాయం మాకో న్యాయమా అని ప్రశ్నించారు ఈటల. గృహలక్ష్మి కింద రూ. 5.04 లక్షలు ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. కేసీఆర్ శంకుస్థాపన చేసిన 42 బస్తీల్లో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూం కట్టాలన్నారు. ఇక కేసీఆర్ సర్కారుకు ఉన్నది మూడు నెలల కాలమేనన్నారు. గృహ లక్ష్మి పథకాన్ని కేవలం ఓట్ల కోసమే తెచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదిస్తే, ఇంటి నిర్మాణం కోసం రూ. 5.04 లక్షలు రూపాయలు కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి సహకారంతో ఇస్తామని ఈటల భరోసా ఇచ్చారు. బీజేపీకి కులం, మతం, రాజకీయంతో సంబంధం లేదని… ఇల్లు లేకుండా బిక్కు బిక్కు మంటూ ఉన్నవారికి ఇల్లు ఇచ్చే జిమ్మేదార్ మాదన్నారు ఈటల.

పట్టణాల్లో అపార్ట్మెంట్లు కట్టించాలని, అర్బన్ హౌసింగ్ కింద కేంద్రం ఇస్తున్న నిధులు వాడాలని ఈటల కేసీఆర్ సర్కారుకు సూచించారు. పక్కన ఉన్న ఏపీని పేద దివాలా రాష్ట్రం అని కేసీఆర్ చెప్తారు. కానీ అక్కడ కూడా కేంద్రం సహకారంతో 20 లక్షల ఇళ్లు కట్టారుని పేపర్లో రాస్తున్నారన్నారు. మళ్లీ బీఆర్ఎస్‌కు అధికారం రాదన్న ఈటల, కొకాపేటలో ఎకరం 100 కోట్లని మురిసిపోయావు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన పేదవాడికి 60 గజాల జాగా ఇచ్చిన దమ్ముందా అని ప్రశ్నించారు. భూములివ్వకపోగా, 60 ఏళ్ల క్రితం ఇచ్చిన భూములు అమ్ముకొలేరని భయపెట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరిస్తున్నారన్నారు. పేదల కళ్ళలో మట్టి కొట్టారు.. 5800 ఎకరాలు లాక్కున్న నీచపు చరిత్ర మీదంటూ ఈటల దుయ్యబట్టారు. బడంగిపేట్‌లో 1954లో ఇచ్చిన భూమికి ధరణి పాసు పుస్తకాలు రాలేదని, లాక్కుంటున్నారని మండిపడ్డారు. 14 ఎకరాలు గుంజుకుంటుంటే బీజేపీ అడ్డుపడిందన్నారు. బీజేపీకి కేసులు కొత్త కాదని… . పేదల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ పెడితే 17 పేపర్లు లీక్ అయ్యాయి. డబ్బులు పెట్టినవాడికే ఉద్యోగాలు ఇచ్చిన నీచపు ప్రభుత్వం ఇది ఈటల దుయ్యబట్టారు. గ్రూప్ 2, పరీక్షను పోస్ట్‌పోన్ చేయాలని కోరుతున్నారని, మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు ఈటల.